|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:39 PM
బరువు తగ్గాలనగానే చాలా మంది ఎక్సర్‌సైజెస్, డైట్స్ అంటూ ఏవేవో ట్రై చేస్తారు. అయితే, అలా కాకుండా నేచురల్‌గానే బరువు తగ్గాలనుకుంటే మాత్రం కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాలి. ఇంట్లోని పదార్థాలనీ సరైన విధానంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. వీటిని సరైన విధంగా తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు. అందుకోసం జీలకర్ర హెల్ప్ చేస్తుంది. న్యూట్రిషనిస్ట్ రాజమణి పటేల్ ఈ విషయం గురించి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. జీలకర్రని ఎలా తీసుకుంటే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుందో తెలుసుకోండి.
బరువు పెరగడానికి కారణాలు
బరువు తగ్గాలంటే ముందుగా అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో తెలుసుకోవాలి. నేటి ఫాస్ట్ లైఫ్‌లో సరైన లైఫ్‌స్టైల్‌ని ఎవరూ ఫాలో అవ్వడం లేదు. దీని గురించి సరైన అవగాహన కూడా ఎవరికీ ఉండడం లేదు. శారీరక శ్రమ లేకపోవడం, పోషకాలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఈజీగా బరువు పెరుగుతారు. ఇలాంటి అలవాట్లని దూరం చేసుకోవాలి. రోజులో ఎంతో కొంత వర్కౌట్స్ చేయాలి. దీంతో పాటు సరైన ఆహారం తీసుకోవాలి. కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గుతారు. అలాంటి టిప్ గురించి తెలుసుకుందాం.
జీలకర్ర నీటితో బరువు తగ్గడం
జీలకర్ర నీటిని తాగి ఈజీగా బరువు తగ్గుతారు. ఈ నీరు బాడీలోని కొలెస్ట్రాల్‌ని ఈజీగా కరిగిస్తుంది. దీనికోసం జీలకర్ర నీటిని ఎలా తయారుచేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే
250 మి.లీ నీరు
1 టీస్పూన్ జీలకర్ర
ఎలా తయారుచేయాలి?
న్యూట్రిషనిస్ట్ రాజమణి ప్రకారం, జీలకర్ర నీరు బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 1 టీస్పూన్ జీలకర్రని 250 మి.లీ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. తర్వాత రోజు ఉదయం ఈ నీటిని 5 నిమిషాలపైనే మరగనివ్వండి. గోరువెచ్చగా అయ్యాక ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి.
రెండో విధానంలో ఎలా తీసుకోవాలి?
ఓ కప్పు నీటిని మరిగించి అందులో 1 టీస్పూన్ జీలకర్రని వేయండి. 5 నుంచి 10 నిమిషాల మరిగిన తర్వాత వడకట్టి తాగండి. ఈ నీరు తాగడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. దీనికి కావాలనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేయొచ్చు.
జీలకర్ర నీటితో బెనిఫిట్స్
జీలకర్ర నీరు బాడీలో మెటబాలిజాన్ని పెంచుతుంది. ఆహారం ఈజీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది.
ఉబ్బరం వంటి సమస్యల్ని దూరం చేసుకోవడంలో జీలకర్ర నీరు ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
ఈ నీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగానే ఉంటుంది. దీంతో ఆకలి ఎక్కువగా ఉండదు. దీంతో ఆహారం ఎక్కువగా తీసుకోం. కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గుతారు. అంతేకాదండోయ్, ఈ నీటిని తాగితే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
జీలకర్ర నీరు ఎలా బరువుని తగ్గిస్తుంది?
జీలకర్ర నీరు తాగే విషయంలో
న్యూట్రిషనిస్ట్ రాజమణి ప్రకారం, జీలకర్ర నీరు తాగేటప్పుడు కొన్ని విషయాలు మరువొద్దు.
రోజుకి ఓ కప్పు జీలకర్ర నీటిని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గుండెల్లో మంట పెరుగుతుంది.
ప్రెగ్నెంట్స్, పాలిచ్చే తల్లలు ముందుగా డాక్టర్ సలహా తీసుకునే తాగాలి.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే ఖాళీ కడుపుతో నీరు తాగకుండా ఉండడం మంచిది.
Latest News