ప్రోటీన్ కోసం పప్పు ఎక్కువగా తింటున్నారా,,,, ఎందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో తెలుసా
 

by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:33 PM

​పప్పులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్ బాడీకి అందితే ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అయితే, ప్రోటీన్ చాలా మందికి నాన్‌వెజిటేరియన్ డిష్‌లో దొరుకుతుందనే అపోహ ఉంటుంది. అలా కాదు, పప్పుల్లోనూ ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా, ఫైబర్, ఐరన్, కాల్షియం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పోషకాలు పప్పుల్లో ఉంటాయి. అయితే, అన్నీ కూడా అన్ని పప్పుల్లో లభిస్తాయని చెప్పలేం. ఒక్కో పప్పుల్లో ఒక్కో పోషకం ఎక్కువగా ఉంటుంది. ఆ వివరాలేంటో చెబుతున్నారు ఫిట్‌నెస్ కోచ్ రుషికేష్.


మినపప్పులో ప్రోటీన్


మినపప్పుని మనం ఎక్కువగా ఇడ్లీ, దోశల్లో వాడతాం. కానీ, అలా కాకుండా ఈ పప్పుని మనం టమాట వేసి దగ్గరికి కూడా వండుకోవచ్చు. దీని వల్ల ప్రోటీన్ అనేది మనకి చాలా వరకూ అందుతుంది. ఈ పప్పుని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటారు. 100 గ్రాము మినపప్పులో దాదాపు 25 గ్రాముల వరకూ ప్రోటీన్ అందుతుంది. దీంతో పాటు ఫైబర్, కాంప్లెక్స్, కార్బ్స్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివన్నీ ఉంటాయి. ఈ పపప్పుని తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అందుతుంది. పైగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. బ్లడ్‌కి మంచిది. ఇందులో బి విటమిన్స్ అయిన ఫోలేట్, నియాసిన్‌లు ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.


ఫైబర్ కోసం ఉలవలు


ఉలవలు అనగానే ఎక్కువగా ఉలవచారు గుర్తొస్తుంది. ఈ ఉలవల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మన జీర్ణ క్రియ మెరుగ్గా మారుతుంది. 100 గ్రాముల ఉలవల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం దగ్గర్నుంచీ బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడం వరకూ చాలా లాభాలు ఉన్నాయి. దీనిని తీసుకుంటే చాలా వరకూ జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాకుండా బోన్ హెల్త్‌కి కూడా చాలా మంచిది.


ఎర్ర కందిపప్పులో ఐరన్


ఎర్ర కందిపప్పునే మైసూర్ పప్పు అని కూడా అంటారు. దీనిని కూడా మనం అన్నీ పప్పుల్లానే వండుకుంటాం. దీనిలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల ఎర్ర కందిపప్పులో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు ఫైబర్, ఫోలేట్, ఐరన్‌లు ఉంటాయి. ఈ పప్పుని తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా జీర్ణమవుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.


శనగపప్పులో కాల్షియం


శనగపప్పుని కూడా మనం అనేక రకాలుగా ఇంట్లో వాడతాం. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పప్పులో మనకి 22 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. దీంతో పాటు ఫైబర్, ఐరన్, బి విటమిన్స్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థకి చాలా మంచివి. దీంతో పాటు కండరాలని మెరుగ్గా చేస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం దగ్గర్నుంచీ బ్లడ్ షుగర్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయ.


పెసరపప్పులో పొటాషియం


పెసరపప్పు మనకి ఈజీగా తయారయ్యే వంట. పెసరపప్పులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీనిని మనం ఎలా అయినా వండుకుంటాం. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అందుకే, ఎక్కువగా ఎండాకాలంలో పెసరపప్పు తీసుకోవడానికి ట్రై చేస్తారు. 100 గ్రాముల పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు కేలరీలు, కార్బ్స్, ఫైబర్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్‌లు ఉంటాయి. ఈ పప్పుని తీసుకోవడం వల్ల కండరాలు రిపేర్ అవుతాయి.


ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది?


​కందిపప్పు‌లో ఫోలేట్


పప్పు అనగానే గుర్తొచ్చే కందిపప్పులో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని మనం పప్పు, పప్పు చారు, ఇలా ఎలా అయినా చేసుకుని తింటాం. కందిపప్పులో 22 గ్రాముల ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎనర్జీని అందిస్తాయి. కండరాలు పెరగడానికి, జీర్ణ సమస్యలకి ఈ పప్పులన్నీ చాలా మంచివి.

Latest News
India launches AI-driven community screening for diabetic retinopathy Wed, Dec 17, 2025, 04:08 PM
'He's got a good pedigree at the death': RCB coach Andy flower on acquisition of Jacob Duffy Wed, Dec 17, 2025, 04:07 PM
'He's got a good pedigree at the death': RCB coach Andy flower on acquisition of Jacob Duffy Wed, Dec 17, 2025, 04:07 PM
Ethiopia's Abiy Ahmed Ali takes to Hindi, thanks PM Modi for bolstering India–Ethiopia ties Wed, Dec 17, 2025, 04:06 PM
Sensex, Nifty slip for 3rd straight session Wed, Dec 17, 2025, 04:01 PM