గుడివాడలో అగ్నిప్రమాదం,,,,కోటి రూపాయల ఆస్తి నష్టం
 

by Suryaa Desk | Sun, Dec 14, 2025, 08:54 PM

కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గుడివాడలోని నెహ్రూ చౌక్‌ సెంటర్‌లో ఉండే అద్దేపల్లి కాంప్లెక్స్‌లో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. సెల్‌ఫోన్‌ షాపులో తొలుత చెలరేగిన మంటలు.. ఆ తర్వాత మిగతా దుకాణాలకు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదంలో కోటి రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Latest News
IPL 2026: 'So excited to get down to Eden,' says Cam Green after being roped in by KKR Tue, Dec 16, 2025, 05:04 PM
Over 3000 Afghan refugees forcibly deported from Iran, Pakistan in single day Tue, Dec 16, 2025, 05:01 PM
GST rate revision has resulted in 5 per cent rise in revenue for states: Minister Tue, Dec 16, 2025, 04:59 PM
BJP Working President Nitin Nabin resigns from Bihar cabinet Tue, Dec 16, 2025, 04:59 PM
India's textiles exports see 4.6 pc growth in last 4 fiscals, exports rise in over 100 nations Tue, Dec 16, 2025, 04:35 PM