|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 01:21 PM
నెల్లూరు కార్పొరేషన్‌లో చంద్రబాబు అనైతిక రాజకీయానికి తెర లేపారని, అందుకే సీబీఎన్ అంటే ‘కానిస్టిట్యూషన్ బైపాస్ నాయుడు’ అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. టీడీపీకి నెల్లూరు మేయర్ పదవి దక్కేలా సీఎం చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలపై వైయస్ఆర్‌సీపీఅధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ....... చంద్రబాబు రాజకీయ జీవితమంతా కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలే. ఏ మాత్రం సంఖ్యాబలం లేకపోయినా నెల్లూరు మేయర్ పదవి కోసం సీఎం చంద్రబాబు దారుణ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం 8 నెలల పదవీకాలం ఉన్న నెల్లూరు మేయర్ పదవి నుంచి ఒక గిరిజన మహిళను తొలగించి, తన తాబేదార్లను కూర్చోబెట్టాలనే నీచ స్థాయికి చంద్రబాబు దిగజారారు. చంద్రబాబు రాజకీయాల్లో ఓటు కాదు.. నోటే ముఖ్యం అన్నది మరోసారి రుజువైంది. నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లను వైయస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయినా పదవుల కోసం వైయస్ఆర్‌సీపీ బీ–ఫామ్‌పై గెలిచిన కార్పొరేటర్లను సంతలో పశువులను కొన్నట్టు కొనుగోలు చేసి, మొన్న డిప్యూటీ మేయర్ పదవిని సంపాదించుకున్నారు. అంతటితో చంద్రబాబు కడుపు మంట చల్లారలేదేమో.. ఇవాళ ఒక గిరిజన మహిళను బలిపశువును చేయాలనే ఉద్దేశంతో పాటు, రాజకీయంగా అణగ దొక్కేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తీర్మానంపై 42 మంది కార్పొరేటర్లు సంతకం చేశారు. వారిలో ఐదుగురు మా పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సమక్షంలో తిరిగి మా పార్టీ గూటికి చేరారు. అయినా ఓటమి భయంతో చంద్రబాబు పోలీసులను పహారాగా పెట్టి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయించారు. అందుకే ఒక మాట స్పష్టమవుతోంది. సీబీఎన్ అంటే ‘కానిస్టిట్యూషన్ బైపాసింగ్ నాయుడు’ అని అభివర్ణించారు.
Latest News