హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపు నిర్ణయం.. ట్రంప్‌కు వ్యతిరేకంగా 20 రాష్ట్రాల దావా
 

by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:37 PM

హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (రూ.90 లక్షలు) రుసుము విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 20 అమెరికన్ రాష్ట్రాలు కోర్టులో దావా వేశాయి. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని, కీలక ప్రభుత్వ సేవలకు ముప్పుగా మారుతుందని ఆ రాష్ట్రాలు వాదించాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహిస్తున్న ఈ దావా.. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేసే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని.. అమెరికా అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. ఇలా హెచ్ 1బీ వీసాలకు భారీ రుసుము పెట్టడం వల్ల హెల్త్, ఎడ్యుకేషన్ వంటి కీలక రంగాల్లో కార్మికుల కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి.


ఈ కొత్త విధానం చట్టవిరుద్ధమని.. నిపుణులైన విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలపై అనవసరమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్స్, యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలలు వంటి కీలకమైన ప్రజా సేవలను అందించే సంస్థలు ఈ హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కాలిఫోర్నియా రాష్ట్రానికి నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులు అవసరమని బోంటా అభిప్రాయం వ్యక్తం చేశారు.


హెచ్-1బీ వీసా దరఖాస్తులపై సెప్టెంబర్ 19వ తేదీన ట్రంప్ జారీ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీ తర్వాత దాఖలు చేసిన హెచ్-1బీ పిటిషన్లకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అమలు చేస్తోంది. అయితే.. ఈ విధానం అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ చట్టాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ చట్టంలో వీసా ఫీజుల్లో మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీలు చెల్లిస్తున్న 960 డాలర్ల నుంచి 7,595 డాలర్ల ఫీజు కంటే ఈ లక్ష డాలర్ల రుసుము చాలా అధికమని రాష్ట్రాలు పేర్కొన్నాయి.


2024–2025 విద్యా సంవత్సరంలో అమెరికన్ పాఠశాల్లో 74 శాతం మంది ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ స్థానాలను భర్తీ చేయడంలో రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో టీచర్లు మూడో స్థానంలో ఉన్నారు. హెల్త్ కేర్ రంగం కూడా ఈ నిర్ణయం వల్ల ఎఫెక్ట్ అయింది. 2024 ఆర్థిక ఏడాదిలో హెల్త్, మెడికల్ వృత్తుల కోసం దాదాపు 17 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేశారు. వారిలో సగం మంది డాక్టర్లు, సర్జన్లు ఉన్నారు. అమెరికాలో 2036 నాటికి 86 వేల మంది డాక్టర్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున.. ఈ కొత్త హెచ్ 1బీ ఫీజులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

Latest News
India's staffing industry surges 5 pc in Q2 FY26 sequentially Wed, Dec 17, 2025, 01:51 PM
Congress MPs protest against Centre on Parliament premises over National Herald case Wed, Dec 17, 2025, 01:46 PM
Searches in J&K's Mansar after villagers report suspicious movement Wed, Dec 17, 2025, 01:15 PM
India aims for a 1.28-crore job expansion in 2026 Wed, Dec 17, 2025, 12:55 PM
Kerala Police officer suspended for alleged sexual assault on woman colleague Wed, Dec 17, 2025, 12:52 PM