|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 02:43 PM
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ఇండిగో సంక్షోభంపై ప్రకటన చేశారు. ఇండిగో ఆపరేషన్స్ గాడిలో పడ్డాయని, ప్రయాణికుల భద్రతే ముఖ్యమని తెలిపారు. ఈ సంక్షోభానికి ఇండిగో సంస్థదే బాధ్యత అని, ప్రయాణికుల సౌకర్యం కోసం దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి, ఇండిగో సీఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. డీజీసీఏకు కూడా నోటీసులు ఇచ్చినట్లు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Latest News