|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 02:24 PM
భారత పౌరసత్వం పొందడానికి ముందే ఓటు హక్కు పొందారనే ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. 1983లో పౌరసత్వం పొందిన సోనియా గాంధీ, అంతకు ముందే 1980లో ఓటరు జాబితాలో పేరు చేర్చారని, మోసం, ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు పొందారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు, కేసు విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.
Latest News