|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 12:35 PM
13 ఏళ్లు దాటిన వాహనాలపై అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక నిరసనకు దిగుతామని AP లారీ ఓనర్స్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం పాత వాహనాల టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులను భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మె జరిగితే నిత్యావసరాల నుంచి అన్నింటిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేలకు పైగా గూడ్స్ రవాణా వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
Latest News