|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:57 PM
హోమ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే శుభవార్త చెప్పింది. డిసెంబర్ ద్వైమాసిక సమావేశంలోనూ మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. ఏ 2025లోనే ఇప్పటి వరకు నాలుగు సార్లు రెపో రేటును తగ్గించింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గింది. దీంతో హోమ్ లోన్ తీసుకున్న వారికి భారీగా వడ్డీ ఆదా అవుతుందని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 బేసిస్ పాయింట్లు అంటే 1 శాతం తగ్గించిన రెపో రేటు ప్రయోజనాన్ని చాలా బ్యాంకులు తమ రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి.
తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గించడం వల్ల ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లెంటింగ్ రేటుతో లింక్ అయి ఉండే హోమ్ లోన్స్ ఈఎంఐ భారం భారీగా తగ్గనుంది. గత ఏడాది వరకు 9 శాతం వరకు ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 7.50 శాతం కిందకు దిగివచ్చాయి. దీంతో లాంగ్ టర్మ్‌లో పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది. ఉదాహరణకు రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నట్లయితే వడ్డీ రేటు 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. దీంతో లాంగ్ టర్మ్‌లో దాదాపు రూ.9 లక్షలు ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఒక వ్యక్తి 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుని రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించక ముందు 8.50 శాతంగా వడ్డీ రేటు ఉందని అనుకుందాం. అప్పుడు నెలకు రూ.43,391 చొప్పున నెలవారీ వాయిదా ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు రేపో రేటును 125 బేసిస్ పాయింట్లు తగ్గించారు. అంటే వడ్డీ రేటు 7.25 శాతానికి తగ్గింది. దీంతో ఈఎంఐ భారం రూ.39,518కు దిగివస్తుంది. అంటే నెలకు దాదాపుగా రూ.4 వేలు ఆదా అవుతుంది. దీంతో దీర్ఘకాలంలో రూ.9.29 లక్షల మేర ఆదా అవుతుంది.
వడ్డీ రేటు తగ్గించినప్పటికీ మునుపటి మాదిరిగానే ఈఎంఐలు చెల్లిస్తే లోన్ టెన్యూర్ తగ్గుతుంది. అలా దాదాపు 42 నెలలు ఈఎం భారం తగ్గుతుంది. దీంతో దాదాపు రూ.18 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ బ్యాకులు వడ్డీ ప్రయోజనాన్ని బదిలీ చేస్తే ఈఎంఐ తగ్గించుకునేందుకు బదులుగా చెల్లింపు వ్యవధిని తగ్గించుకోవడం మంచిదని చెబుతున్నారు.
Latest News