|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 11:33 AM
ఏపీలో రేషన్‌కార్డుదారులకు ఈ నెల కూడా నిరాశే మిగిలింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో కందిపప్పు అందుబాటులోకి రాలేదు. కొన్ని నెలలుగా స్టాక్ లేకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు పంపిణీ జరగలేదు. రేషన్‌లో రూ.60 లోపు దొరికే కందిపప్పు, మార్కెట్‌లో రూ.100–120కు దొరకడంతో భారంగా మారింది. సరైన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడంలో ఆలస్యం కారణంగా సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ నెల మూడు కేజీల రాగులు మాత్రం ఉచితంగా ఇస్తున్నారు. సంక్రాంతికైనా రేషన్‌లో కందిపప్పు వస్తుందేమో చూడాలి.
Latest News