|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 11:29 AM
సోమవారం ప్రత్యేక సందర్భంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి, స్వామి–అమ్మవార్ల దర్శనం కోసం భారీ క్యూ లైన్లలో నిలబడ్డారు. శివ స్వాముల ఘోషలతో క్షేత్రం అంతా మారుమోగింది. శివ స్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, మిగతా భక్తులందరికీ అలంకార దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం అధికారులు అదనపు బందోబస్తు, సేవలను ఏర్పాటు చేశారు.
Latest News