|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:40 AM
ఇజ్రాయెల్, హమాస్‌ను తీవ్రవాద సంస్థగా గుర్తించాలని భారత్‌ను అధికారికంగా కోరింది. హమాస్-లష్కరే తోయిబా సంబంధాలు పెరుగుతున్నాయని, లష్కరే తోయిబాను ఇప్పటికే ఉగ్రదళంగా ప్రకటించినందున హమాస్‌కూ అదే గుర్తింపు ఇవ్వాలని తెలిపింది. ఐఆర్‌జీసీ, హమాస్, హిజ్బుల్లా అంతర్జాతీయ నేర జాలాలను ఉపయోగిస్తున్నాయంటూ ఆరోపించింది. అమెరికా, యూకే, కెనడా హమాస్‌ను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. భారత్ కూడా అలాగే చేస్తే ప్రపంచానికి బలమైన సందేశం వెళ్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది.
Latest News