|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 10:18 PM
FIFA World Cup 2026 షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. 39 రోజులపాటు జరగబోయే ఈ మెగా టోర్నీ జూన్ 11న ప్రారంభమై జులై 19 వరకు కొనసాగుతుంది.2026 ఫిఫా వరల్డ్ కప్కు కెనడా, మెక్సికో, యుఎస్‌ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. గతంలో వరల్డ్ కప్‌లో 32 దేశాలు పోటీపడగా, ఈసారి 48 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు జరుగుతాయి.టోర్నీకి ఎంపికైన 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ఇంకా 6 స్థానాలు ఖరారు కాలేదు, ఇవి పోటీపడే ఇతర దేశాల కోసం కాపీ చేశారు, ఇందులో ఇటలీ సహా పలు దేశాలు ఉంటాయి.
*ముఖ్యమైన తేదీలు:
-గ్రూప్ స్టేజ్: జూన్ 11 – 27
-రౌండ్ ఆఫ్ 32: జూన్ 28 – జులై 2
-రౌండ్ ఆఫ్ 16: జులై 4 – 7
-క్వార్టర్ ఫైనల్స్: జులై 9 – 11
-సెమీ ఫైనల్స్: జులై 14 – 15
-కాంస్య పతక మ్యాచ్: జులై 18
-ఫైనల్: జులై 19
ఐతే, మొదటి మ్యాచ్ జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో vs సౌతాఫ్రికా మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని ది మెట్‌లైఫ్ స్టేడియం, న్యూయార్క్/న్యూ జెర్సీలో ఉంటుందని నిర్ణయించారు.డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది.