|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:40 PM
జబర్దస్త్‌తో ఫేమ్ సంపాదించిన హైపర్ ఆది ఇప్పుడు పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతని స్కిట్స్‌లో వచ్చే కామెడీ పంచులు ప్రేక్షకులను అలరిస్తుంటాయి.అయితే ఆది ఎక్కువగా బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఆధారిత కామెడీ చేస్తాడంటూ విమర్శలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు అతని డైలాగులు అవతలి వ్యక్తిని తగ్గించేలా ఉంటాయనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అప్పుడప్పుడు అడల్ట్ టచ్ ఉన్న హాస్యం కూడా చేస్తాడని కొంతమంది అభిప్రాయం.ఇటీవల నటి ఇంద్రజ ఈ విషయంపై స్పందించారు. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఆమె, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోలలో జడ్జ్‌గా కనిపిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ–ఆది కలిసి పని చేస్తున్నారు.ఒక ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ “స్కిట్స్‌లో పంచులు వేయడం సహజం. కానీ పంచులు వేయడమే కాదు, వాటిని తీసుకోవడం కూడా రావాలి. ఆది మాత్రం పంచ్ వేస్తే తీసుకోడు. మమ్మల్ని టీజ్ చేస్తే సరే, మేము అతనిపై పంచ్ వేస్తే వెంటనే ఏదో ఒక కారణం చెప్తాడు. అది అంత బాగుండదు, ఈగోకి వెళ్తాడు. తనపై పంచ్ వచ్చినప్పుడు ఆది హ్యాండిల్ చేయలేకపోతాడు” అని చెప్పింది.అంతేకాదు“ఎప్పుడూ అమ్మాయిల మీదే కామెడీ చేస్తుంటాడు. అమ్మాయిలను ఆధారంగా చేసుకుని బాడీ షేమింగ్ జోకులు వేస్తాడు. అవన్నీ పాత జోకులే అని నేను చెబుతుంటాను. ఆది మీద పంచులేస్తే కూడా ప్రేక్షకులు నవ్వుతారు… కానీ ఆయన ఆ విషయం గమనించట్లేదు” అని తెలిపారు.అయితే వ్యక్తిగతంగా ఆది గురించి మంచి మాటలే చెప్పింది ఇంద్రజ: “పర్సన్‌గా ఆయనంటే నాకు గౌరవం. పూర్తిగా వర్క్ పై దృష్టి పెట్టే వ్యక్తి. ఎలాంటి సపోర్ట్ లేకుండా గ్రామం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరాడు. ఆయనకు ఏ పని వచ్చిందంటే, చేయలేనప్పుడు ఇంకొకరికి ఇస్తాడు. తనతో పాటు ఇతరులను కూడా అవకాశాలు తీసుకెళ్లే వ్యక్తి” అని ఆమె వివరించింది.
Latest News