|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:32 PM
ఇండిగో విమానాల రద్దు సAGA కొనసాగుతూనే ఉంది. ఆదివారం మొత్తం 650 ఫ్లైట్‌లను రద్దు చేసినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇండిగో గత ఐదు రోజులుగా వరుసగా అనేక సేవలను రద్దు చేస్తోందన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఆదివారాల్లో సగటున 2,300 ఫ్లైట్‌లు నడిపే ఇండిగో, ఈసారి మాత్రం 1,650 విమాన సర్వీసులు మాత్రమే నడుస్తాయని ముందుగానే ప్రకటించింది. పరిస్థితులు డిసెంబర్ 10 నాటికి పూర్తిగా సహజస్థితికి వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో ఇండిగో ఫ్లైట్ రద్దులు ఎక్కువగా నమోదయ్యాయి.ఇదిలా ఉండగా, టికెట్ రీఫండ్‌ల విషయంపై కంపెనీ మరో కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించటం తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపింది. అలాగే ఈ సమస్యను తీర్చేందుకు సీఈఓ, బోర్డు సభ్యులతో కూడిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు ఇండిగో వెల్లడించింది. ఈ గ్రూప్ విమాన సర్వీసుల పునరుద్ధరణ మరియు సంక్షోభ నివారణ చర్యలపై దృష్టి పెట్టనుంది. ప్రయాణికులకు ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు రీఫండ్‌లు జారీ చేయాలని డీజీసీఏ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.ఫ్లైట్ రద్దుల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ముందుగానే సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా, తాజాగా నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కొత్తగా మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టింది. దీర్బూగఢ్–న్యూఢిల్లీ, గువాహటి–హౌరా రూట్లలో సోమవారం నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇప్పటికే నడుస్తున్న 18 రైళ్లకు 20 అదనపు కోచ్‌లు జోడించినట్లు అధికారులు తెలిపారు.
Latest News