|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:16 PM
హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని, వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఆశ చూపించి మతమార్పిడులకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం ఒక కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రలోభాలకు గురిచేసి మతాలను మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే, అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం అని ఆయన స్పష్టం చేశారు.దేశం కోసం, ధర్మం కోసం హిందూ సమాజంలోని అన్ని వర్గాలు ఏకం కావాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఐక్యతే భారతదేశానికి అసలైన రక్ష అని, అదే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.
Latest News