|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:03 PM
AP: పేదల కోసం రేషన్ బియ్యంతో పాటు పోషక విలువలున్న తృణధాన్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం, ఈ పథకాన్ని ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ ప్రారంభిస్తోంది. కొంత బియ్యానికి బదులుగా తృణధాన్యాలను రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్నారు. ప్రజలు రాగులు, జొన్నలపై ఆసక్తి చూపుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తృణధాన్యాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో కూడా రాగులను పంపిణీ చేసినట్లు సమాచారం.
Latest News