|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:00 PM
నంద్యాల దేవనగర్ ప్రాంతంలోని నూరని మస్జీద్‌లో జరిగిన సమావేశంలో స్థానిక ముస్లిం సోదరులు 5 మస్జీద్‌లకు సంబంధించిన రెవెన్యూ భూ సమస్యలను టీడీపీ నేత NMD ఫిరోజ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఫిరోజ్ వెంటనే ఆర్డీఓను ఫోన్‌లో సంప్రదించి రికార్డులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఆర్డీఓ కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిరోజ్ చర్యపై మస్జీద్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News