|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:02 PM
అమెరికా డల్లాస్ లోని కర్టిస్ కల్ వెల్ సెంటర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీ హరిహరపీఠం వేదపండితులు మంత్రి లోకేశ్ కు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి లోకేశ్ ప్రసంగిస్తూ.... ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. రెండేళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మరో రెండేళ్లు స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేశాను. ఈ దేశంలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నాను. కానీ, ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఆరుగురు పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అని చెప్పారు. బయట చాలా రద్దీగా ఉంది, మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని చెప్పారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘనస్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Latest News