|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:48 PM
చెన్నైలోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి, ఇద్దరు వ్యక్తులు లెస్లీ పింటో (56) అనే రిటైర్డ్ ఉద్యోగి నుండి రూ. 33.53 లక్షలు వసూల్ చేసి మోసం చేశారు. లెస్లీ పింటో కుమార్తెకు నీట్‌లో తక్కువ మార్కులు రావడంతో, బంధువుల ద్వారా పరిచయమైన రాకీ సావియో, స్టీఫెన్ పీటర్‌లు ఈ మోసానికి పాల్పడ్డారు. స్టీఫెన్‌ను సంప్రదించగా, రూ. 30 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో లెస్లీ పింటో ఆ మొత్తాన్ని జోహన్ పీటర్ అనే వ్యక్తి ఖాతాకు పంపించారు. అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఆలస్యం అవుతోందని చెప్పి, చివరికి నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. దీంతో లెస్లీ పింటో పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు మోసం కేసు నమోదు చేశారు.
Latest News