|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:21 PM
AP: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణం శనివారం వస్తే చాలు ఎంతో ప్రశాంతంగా మారుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’లో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్ వాహనాలు వేసుకుని రావద్దని సూచించింది. దాంతో కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు మొదలుకొని అధికారులు, ఉద్యోగులు సైకిల్‌పై లేదా నడిచి వస్తున్నారు. తెలియక ఎవరైనా వాహనం వేసుకొచ్చినా గేటు వద్ద ఒకరు వారికి అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని వారాలుగా ఈ విధానం కొనసాగుతోంది.
Latest News