|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:51 PM
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరుతో షో చేస్తున్న సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పిల్లలతో మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి,వైయస్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. నాడు–నేడు మనబడిలో భాగంగా సమూలంగా మార్పు చేసిన స్కూల్‌లోనే చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే అచ్చం సినిమా షూటింగ్‌లా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అందుకోసం స్కూల్ ఆవరణలో క్లాస్‌రూమ్ సెట్ వేశారని తెలిపారు. అయితే ఆ సెట్‌లో వాడిన బెంచ్‌లు, ఫర్నీచర్, డిజిటల్ బోర్డు సహా, అన్నీ గత ప్రభుత్వ హయాంలో ఆ స్కూల్‌లో నాడే–నేడు కింద ఏర్పాటు చేసినవే అని చెప్పారు. అంటే జగన్‌గారు బాగు చేసిన స్కూల్‌లోనే కూర్చుని, పిల్లలతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు, పిచ్చి విమర్శలు చేశారని ఆక్షేపించారు. ఇంత కంటే హేయం మరొకటి ఉండదని శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు.
Latest News