|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 08:55 PM
ప్రపంచం ఆర్థిక మందగమనం గురించి మాట్లాడుతున్న ప్రస్తుత తరుణంలో మన దేశం వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు ప్రతి రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, భారతదేశ అభివృద్ధిలో నారీశక్తి పాత్ర గణనీయంగా పెరిగిందని, దీని ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.వలస పాలన నాటి మూలాలను పూర్తిగా వదిలించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా భారత్ ఎదుగుతోందని మోదీ పేర్కొన్నారు. 2025లో ప్రభుత్వం సాధించిన మైలురాళ్లలో ప్రత్యక్ష పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలు ఒకటని ఆయన అన్నారు. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదని గుర్తు చేశారు.
Latest News