|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 03:03 PM
ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పాతబడిన ప్లాస్టిక్ సీసాల నుంచి ప్రమాదకరమైన రసాయనాలు, సూక్ష్మక్రిములు నీటిలో కలిసిపోయి.. ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతాయి. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వృద్ధి చెందడానికి, బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ వంటి రసాయనాలు నీటిలో చేరడానికి, మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ శరీరంలో పేరుకుపోవడానికి ఇవి కారణమవుతాయని ఈ అధ్యయనాలు చెప్తున్నారు.
Latest News