|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:41 AM
AP: రాష్ట్రంలోని రైతులకు అలర్ట్. రబీ సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్‌బీమా (PMFBY), వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు చివరి తేదీ డిసెంబర్ 31. వేరుసెనగ, టమాటా రైతులు డిసెంబర్ 15 లోపు, మామిడి రైతులు జనవరి 3లోపు ప్రీమియం చెల్లించాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఈ పథకాల ద్వారా రైతులకు పరిహారం లభిస్తుంది. కాగా, రబీ బీమా అమలుకు ప్రభుత్వం రూ.44.06 కోట్లు ముందస్తు ప్రీమియంగా విడుదల చేసింది.
Latest News