|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:43 AM
ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ కడియాల రవిశంకర్ పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ, దళిత నాయకులు, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Latest News