|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 10:35 AM
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డిసెంబర్ 15 తుది గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టులో ప్రారంభమైన పంపిణీలో ఇంకా వేలాది కార్డులు లబ్ధిదారులకు అందలేదు. గడువులోపు తీసుకోకపోతే కార్డులను కమిషనరేట్‌కు తిరిగి పంపిస్తారు. దీనివల్ల కార్డులు రద్దు కావు కానీ, మళ్లీ పొందాలంటే రూ.200 చెల్లించి దరఖాస్తు చేయాలి. మ్యాపింగ్ లోపాల వల్ల కార్డులు ఎక్కువగా మిగిలిపోయినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు గడువులోపు తమ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Latest News