|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 10:37 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు తిరిగింది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్‌కు ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియన్ సంస్థకు ఇచ్చిన రూ.2.5 కోట్ల విరాళాల మూలం, లావాదేవీ వివరాలు, సంబంధిత డాక్యుమెంట్లు డిసెంబర్ 19లోపు సమర్పించాలని ఆదేశించింది. విరాళం ఎందుకు ఇచ్చారు, ఎవరి సూచనతో ఇచ్చారు, సోనియా గాంధీ–రాహుల్ గాంధీతో చర్చ జరిగిందా వంటి ప్రశ్నలతో నోటీసుల్లో వివరణ కోరారు.
Latest News