|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:48 PM
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులు, అర్చకులతో ఈవో శ్రీనివాసరావు సమావేశమయ్యారు. గత ఏడాది కంటే 30 శాతం అధికంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, అటవీ నడకదారిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న రథోత్సవం జరగనున్నాయి.
Latest News