|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 08:26 PM
ఐ బొమ్మ రవి విచారణలో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. టీవీ9తో మాట్లాడిన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు కేసు పురోగతిపై పలు కీలక విషయాలను వెల్లడించారు.రవి తన తప్పును ఒప్పుకున్నట్టేమీ లేదని, పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని డీసీపీ చెప్పారు. ఆయన చెప్పాలనుకున్నదే చెప్పినట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చినట్లు వివరించారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవి ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.రవి మూడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడని, ఆ ప్రమోషన్‌ల ద్వారా వచ్చిన డబ్బుతో లావిష్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడ్డాడని డీసీపీ తెలిపారు. ఇంకా కొన్ని ఆర్థిక లింకులు రవికి సంబంధించి బయటపడాల్సి ఉందని, అందువల్ల మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టు అన్నారు.ఇక రవికి పోలీస్ డిపార్ట్‌మెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చిందని బయట వస్తున్న వార్తలకు డీసీపీ స్పష్టత ఇచ్చారు. “ఐ బొమ్మ రవికి మేము ఎలాంటి జాబ్ ఆఫర్ ఇవ్వలేదు. బయట ఊహాగానాలు అసత్యం” అని పేర్కొన్నారు.రవి తాము గుర్తించిన ప్రాపర్టీలు హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఐ బొమ్మకు అనుబంధంగా పనిచేస్తున్న మిర్రర్ సైట్లను పూర్తిగా మూసివేసినట్లు డీసీపీ తెలిపారు. రవి కేసు దర్యాప్తు మరో దశకు చేరుకున్నట్లు, పోలీసుల బృందం ఆర్థిక లింకులు, ప్రమోషన్ నెట్‌వర్క్, లావాదేవీలపై పూర్తి వివరాలను సేకరిస్తోందని అరవింద్ బాబు తెలిపారు.
Latest News