|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:55 PM
ఆటోమొబైల్ మార్కెట్‌లోకి SUVలను పరిచయం చేసే విషయంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక స్థానం ఉందని చాలామంది భావిస్తారు. ఎందుకంటే ఈ కంపెనీ తయారు చేసే వాహనాలు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, కఠినమైన రోడ్లను కూడా ఈజీగా ఎదుర్కోగలిగేలా డిజైన్ చేస్తారు.ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, మహీంద్రా వాహనాలంటే ప్రజల్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కొత్త మోడల్ ఏదైనా రిలీజ్ అయిన వెంటనే అమ్మకాల పరంగా హాట్ కేకుల్లా మారిపోతుంది. అయితే తాజాగా విడుదలైన మహీంద్రా కొత్త కారు మాత్రం ప్రత్యేకంగా మిడిల్ క్లాస్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. సాధారణంగా మహీంద్రా వాహనాలు ఖరీదైనవన్న అభిప్రాయం ఉన్నా, ఈ మోడల్ మాత్రం కేవలం రూ.3.80 లక్షలకే లభిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే అందరి ప్రశ్న—ఈ కారు ఏమిటి?2025లో లగ్జరీ కార్లపై దృష్టి పెట్టిన మహీంద్రా, అదే సమయంలో సామాన్య వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా Mahindra Bolero మోడల్‌ను రూపొందించింది. పాత బొలెరో ఎంత రఫ్ రోడ్ అయినా సులభంగా వెళ్లే సామర్థ్యంతో ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. తాజా బొలెరో కూడా మిడిల్ క్లాస్ కొనుగోలుదారులను బాగా ఆకట్టుకుంటుందనే చర్చ ఉంది. డ్రైవింగ్ చేస్తే అలసట తగ్గేలా డిజైన్ చేయబడటంతో పాటు, ఇంత తక్కువ ధరలో 40 kmpl మైలేజ్ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా రూ.3.80 లక్షలకు SUV లభించడం చాలామందిని నమ్మశక్యం అయ్యేలా లేదు.ఈ వాహనంలో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉపయోగించారు. అంతేకాకుండా USB చార్జర్, విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, ఆకట్టుకునే డాష్‌బోర్డ్ డిజైన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఇది సౌకర్యవంతంగా అనిపించేలా రూపొందించారు. భద్రతా పరంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లను అందించారు. బలమైన ఇనుప నిర్మాణం వల్ల ఇంపాక్ట్ ప్రొటెక్షన్ కూడా మెరుగ్గా ఉంటుంది. అధిక లోడును కూడా సులభంగా భరించేలా దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది.మేంటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం, రీసేల్ విలువ ఎక్కువగా ఉండటం వలన వ్యక్తిగత అవసరాలతో పాటు వ్యాపార అవసరాలకు కూడా ఈ వాహనం ఉపయోగకరం కానుంది. ఈ ఏడాదిలో అత్యల్ప ధరలో లభించే SUV ఇదే కావడంతో మార్కెట్‌లో హైలైట్ కాబోతుందనే అభిప్రాయం ఆటోమొబైల్ నిపుణులది. లగ్జరీ రూపంలో కనిపించే ఈ కారు తక్కువ ధరలో రావడంతో చాలామంది కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
Latest News