|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:05 PM
AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో జగన్ అబద్ధాలు బట్టబయలయ్యాయని అన్నారు. పెట్టుబడి రాయితీ ఇవ్వని జగన్‌కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రైతులను మోసం చేసిందెవరో ప్రజలకు తెలుసునని, వాస్తవాలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
Latest News