|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 01:45 PM
గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మంచి చేసేందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని ఆయన తెలిపారు. గురువారం గుడివాడ పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుడివాడ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
Latest News