|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 10:37 AM
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడు జునైద్‌ను సన్నీ కాల్చి చంపాడు. జునైద్ తన స్నేహితుడు సన్నీ చెల్లిని ప్రేమించడమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. యువతి, జువైద్ అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా సన్నీ చూడటంతో కోపం పెంచుకుని, జువైద్‌ను కిడ్నాప్ చేసి అడవికి తీసుకెళ్లి కాల్చి చంపినట్లు సమాచారం. జువైద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తులో సన్నీ హత్య చేసినట్లు తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.
Latest News