|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:19 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు నిన్న విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలను ప్రతిరోజూ రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని ఆయన తెలిపారు.ఈ ఏడాది టెట్ కోసం అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా 2,41,509 మంది అభ్యర్థుల నుంచి 2,71,692 దరఖాస్తులు వచ్చాయని కృష్ణారెడ్డి వివరించారు. అభ్యర్థులు పరీక్ష విధానంపై అవగాహన పెంచుకునేందుకు వెబ్‌సైట్‌లో మాక్ టెస్టులను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు
Latest News