90 దాటిన 'రూపాయి' విలువ.. అయినా నో టెన్షన్
 

by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:46 PM

డాలర్‌‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. తొలిసారి 90 రూపాయల మార్క్ దాటింది. రూపాయి విలువ భారీగా పతనమవుతున్న క్రమంలో ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై, దేశ ఎగుమతులపై పడుతుందన్న ఆందోళనలు నెలకొంటున్నాయి. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయ విలువ 90 రూపాయల మార్క్ దాటినా ప్రభుత్వం ఆందోళన చెందడం లేదంటూ పేర్కొన్నారు.


రూపాయి విలువ సరికొత్త జీవన కాల కనిష్ఠ స్థాయి 90 రూపాయల మార్క్ దాటినా దాని ద్వారా ద్రవ్యోల్బణం పైన గానీ, ఎగుమతులపైన గానీ ప్రభావం ఉండదని సీఈఏ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది పరిస్థితి మెగురు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సదర్భంగా రూపాయి విలువ పడుపోవడంపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠగానే ఉందన్నారు. ఎగుమతులపై రూపాయి విలువ పెద్దగా ప్రభావం చూపదని, దీంతో ఇతర అంశాలు సైతం ఎలాటి ప్రభావితం కావన్నారు.


రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోల్చినప్పుడు బుధవారం ఇంట్రాడేలో 90.30 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం ముగింపుతో పోలిస్తే 34 శాతం మేర క్షీణించింది. ఎఫ్ఐఐల అమ్మకాలు, డాలర్ కొనుగోళ్ల మద్దతు వంటి వివిధ కారణాలు ఉన్నట్లు అనలిస్టులు చెబుతున్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లో క్షీణత, భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోవడమూ రూపాయి విలువ పడిపోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఫారెక్స్ ట్రేడర్లు సైతం ఇలాంటి వాదనలే వినిపిస్తున్నారు. రూపాయి విలువ పతనం విషయంలో కేంద్రంపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రూపాయి విలువ పతనాన్ని అరికట్టాలని, కేంద్రం అసమర్థ చర్యలతోనే రూపాయ విలువ పడిపోతోంది అంటూ ఆరోపిస్తున్నాయి.

Latest News
Karnataka Upalokayukta's '63 pc corruption' remark ignites fierce war of words between Siddaramaiah and BJP Fri, Dec 05, 2025, 12:37 PM
We'd to give back not hundreds of thousands, but millions: CA boss reflects on revenue loss from Perth Test Fri, Dec 05, 2025, 12:32 PM
On NC founder's birth anniversary, Farooq Abdullah says J&K govt working on 'razor's edge' Fri, Dec 05, 2025, 12:26 PM
Russian President Vladimir Putin pays tribute to Mahatma Gandhi at Rajghat Fri, Dec 05, 2025, 12:25 PM
Air pollution can heighten anxiety and trigger panic-like symptoms: Doctors Fri, Dec 05, 2025, 12:17 PM