|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:36 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి తన పూర్వ వైభవాన్ని గుర్తు చేసే ఫామ్‌ను అందుకుంటున్నాడు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన కోహ్లీ… రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ మరో సెంచరీతో గ్రేట్ కమ్‌బ్యాక్‌ను నమోదు చేశాడు. వరుసగా రెండు శతకాలతో (Back-to-Back Centuries) ‘వింటేజ్ కోహ్లీ’ తిరిగొచ్చాడని అభిమానులు అంటున్నారు.ఈ రెండు శతకాలతో కోహ్లీ, న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ పేరిట ఉన్న ఒక ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఆ రికార్డ్ ఏంటన్నది చూస్తే… ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు చేరిన కోహ్లీ, అక్కడ తొలి రెండు వన్డేల్లో అంచనాలకు విరుద్ధంగా డకౌట్ అయ్యాడు. అయితే మూడో మ్యాచ్‌లో అజేయ అర్ధశతకం (74) బాదుతూ ఫామ్‌కు చేరాడు. అనంతరం స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా సిరీస్‌లో తన పూర్తి దాటిని ప్రదర్శిస్తున్నాడు.సఫారీలతో తొలి వన్డేలో కోహ్లీ 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 135 పరుగులు చేశాడు. రెండో వన్డేలో మాత్రం మొదటి వంద పరుగులు కేవలం 90 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఆయన శతకంలో ఏడు బౌండరీలు, రెండు సిక్సులు ఉన్నాయి.రాయ్‌పూర్ మ్యాచ్‌లో మొత్తంగా 93 బంతులు ఆడిన కోహ్లీ… 102 పరుగుల వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐడెన్ మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 22 పరుగులు, తరువాత రుతురాజ్ గైక్వాడ్ (105)తో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో 27 పరుగులు జోడించి పెవిలియన్ చేరాడు.సౌతాఫ్రికాపై వన్డేల్లో ఇది కోహ్లీకి మూడో సెంచరీ కావడం ప్రత్యేకం. కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు సఫారీలపై మూడు శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా ఉండగా—కోహ్లీ ఇప్పుడు అతడి రికార్డును సమం చేశాడు.
సౌతాఫ్రికాపై కోహ్లీ వన్డే శతకాలు
-కోల్‌కతా – వన్డే వరల్డ్‌కప్ 2023: 101*
- రాంచి – 2025: 135
-రాయ్‌పూర్ – 2025: 102