|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:32 PM
అమెరికాలో భారతీయులు లేకపోతే దేశాభివృద్ధి ఆగిపోతుందని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. భారతీయుల ప్రతిభను అమెరికా అనేక ఏళ్లుగా వాడుకుందని ఆయన అన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగమైందని, గత ప్రభుత్వాల ఉదాసీనత వల్లే వలసలకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగాయని మస్క్ తెలిపారు. బైడెన్ హయాంలో సరిహద్దు నియంత్రణ లేకపోవడం వల్ల అక్రమ వలసలు పెరిగాయని, ఇది దేశానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో నిపుణుల కొరత ఉందని, సంక్లిష్ట పనులకు ప్రతిభావంతులను నియమించుకోవాలని సూచించారు.
Latest News