|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:18 PM
జాతీయ స్థాయి గిరిజన విద్యార్థుల సాంస్కృతిక వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్) విద్యార్థుల కోసం నిర్వహించే 'ఉద్భవ్-2025' వేడుకలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ జాతీయ స్థాయి ఉత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసింది.అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీలో ఈరోజు నుండి మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ 6వ జాతీయ స్థాయి ఈఎంఆర్‌ఎస్ సాంస్కృతిక ఉత్సవాలలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు తమ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ఒకే వేదికపై ప్రదర్శించనున్నారు. వారి ఆటపాటలతో అమరావతిలో సందడి నెలకొననుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ హాజరుకానున్నారు. ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఈ పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా కృష్ణ జింకను మస్కట్‌గా ఎంపిక చేసి, దానికి 'క్రిష్' అని నామకరణం చేశారు.
Latest News