|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:19 PM
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలన్నిటికీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కామన్ డేటా సెంటర్‌గా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచే ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించి 'డేటా లేక్' ద్వారా విశ్లేషించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెరిగేలా పౌరసేవలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, సేవలను మరింత సులభతరం చేయాలన్నారు. మీడియాలో వచ్చే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు 175 నియోజకవర్గాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు కృషి చేయాలని అన్నారు.
Latest News