|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 01:18 PM
న్యూఢిల్లీలోని ప్రసారభారతి (దూరదర్శన్ & ఆకాశవాణి పేరెంట్ సంస్థ) 29 కాంట్రాక్ట్ కాపీ ఎడిటర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు (డిసెంబర్ 3, 2025) ఆఖరి తేదీ కావడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరపడాల్సి ఉంది. మీడియా రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువ జర్నలిస్టులకు ఇది అద్భుతమైన అవకాశం.
అర్హతల విషయానికొస్తే… గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా తప్పనిసరి. అంతేకాదు సంబంధిత రంగంలో కొంత పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీతో పాటు ఏదో ఒక స్థానిక భాషపై మంచి పట్టు కావాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు దాటకూడదు.
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష లేదా నేరుగా ఇంటర్వ్యూ ఉండవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 జీతంగా చెల్లిస్తారు. ప్రసారభారతి వంటి జాతీయ స్థాయి సంస్థలో పనిచేసే అవకాశం ఎంతోమంది కలల్లో ఉంటుంది కదా!
దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ https://prasarbharati.gov.in వెళ్లి వివరాలు చూసి ఈరోజు సాయంత్రానికల్లా అప్లై చేసేయండి. ఒక్క రోజు ఆలస్యం అయితే ఈ గోల్డెన్ ఆఫర్ చేజారిపోతుంది… త్వరపడండి!