|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:43 PM
తనమీద నమోదైన కేసులను తానే ఎత్తేయించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తాను నిందితుడుగా ఉన్న కేసులో తానే విచారణాధికారిగా ఉంటూ తీర్పులిచ్చుకోవడంపై ఆయన విష్మయం వ్యక్తం చేశారు. 2023లో లిక్కర్ కేసులో గతంలో ఆధారాలతో కేసు నమోదు చేసిన సీఐడీ నేడు అదే కేసులో ఆధారాల్లేవని సీఐడీ చిలకపలుకులు పలకుతోందని.. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అధికారులను బెదిరించి కూటమి ప్రభుత్వం పబ్బం గడపుకుంటున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 538 రోజుల పాలనలో రోజుకి సగటున రూ.466 కోట్లు చొప్పున రూ.2.51 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు.. హామీలు అమలు చేయకుండానే చేసిన అప్పంతా ఏమైందని నిలదీశారు. కూటమి పాలనలో కిలో అరటి రూ.1 కి పడిపోయి అన్నదాతలు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతుంటే... ప్రభుత్వం మాత్రం ఎకరం భూమి 99 పైసలు చొప్పున ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా దోచిపెట్టడంపై తీవ్రంగా ఆక్షేపించారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ప్రతినెలా పెన్షన్ పంపిణీ పేరుతోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని తేల్చి చెప్పారు. 18 నెలల కాలంలో 5 లక్షల పెన్షన్లు కోత విధించిన చంద్రబాబుది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వమని స్పష్టం చేశారు.
Latest News