|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:04 PM
గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన కంభంపాటి ఆనందబాబు భార్య జయలక్ష్మి, భగవద్గీత కంఠస్థ పారాయణంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల మైసూర్ దత్తపీఠం నిర్వహించిన ఆన్లైన్ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. గీతా జయంతి సందర్భంగా మైసూరు దత్త పీఠంలో సచ్చిదానంద సద్గురు స్వామీజీ చేతుల మీదుగా ఆమెకు మెడల్ తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. షిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. త్వరలో ఆమెను ఘనంగా సన్మానిస్తామని కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.
Latest News