|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:47 PM
యాషెస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగే రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించింది. ఎప్పట్లాగే మ్యాచ్‌కు రెండు రోజుల ముందే తమ జట్టును అనౌన్స్ చేసింది. ఈ డే నైట్ టెస్టు కోసం ఇంగ్లాండ్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడ్డ మార్క్‌వుడ్ ప్లేసులో ఆల్ రౌండర్ విల్ జాక్స్‌ను ప్లేయింగ్ లెవెన్‌లో చేర్చింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత విల్ జాక్స్.. ఇంగ్లాండ్ టెస్ట్ జెర్సీని ధరించనున్నాడు.
కొన్ని నెలలుగా మోకాలి గాయంతో బాధపడుతున్న మార్క్‌వుడ్.. యాషెస్ తొలి టెస్టులోనూ పెద్దగా బౌలింగ్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో మరో మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు.
మరోవైపు విల్ జాక్స్.. మూడేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడు 2022 డిసెంబర్‌లో పాకిస్థాన్‌తో చివరిసారి రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. జాక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. బ్యాటింగ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 89 పరుగులు స్కోరు చేశాడు. బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక యాషెస్ టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ పేలవంగా ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. 104 ఏళ్ల చరిత్రలో యాషెస్ టెస్టు ఇంత త్వరగా పూర్తవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. డిసెంబర్ 4 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
యాషెస్ రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జెమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్
Latest News