|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:11 PM
రష్యాకు చెందిన ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ.. భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ వేళ.. పాకిస్తాన్ ప్రయోగించిన వైమానిక దాడులను.. పూర్తిగా తిప్పికొట్టడంలో 2018లో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది. ఈ నేపథ్యంలోనే రష్యాతో ఎస్-400 దిగుమతి చేసుకునేందుకు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 3 ఎస్-400లు భారత్ దిగుమతి చేసుకోగా.. మరో 2 వచ్చే 2 ఏళ్లలో అందించనుంది.
అయితే ఎస్-400 తర్వాత రష్యా అభివృద్ధి చేసిన ఎస్-500 పై ఇప్పుడు భారత్ కన్ను పడింది. వాటిని కొనుగోలు చేయాలని.. భారత్ దృష్టి పెట్టింది. డిసెంబర్ 4, 5వ తేదీల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఎస్-500 అంశం ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఎస్-400 కంటే అత్యంత అధునాతనమైన ఎస్-500 ప్రొమెథియస్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపిస్తోంది.
ఈ ఎస్-500 వ్యవస్థ 500-600 కిలోమీటర్ల పరిధి.. 180-200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఇది విమానాలు, డ్రోన్‌లతో పాటు బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాలను కూడా ఎదుర్కోగలదని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్ 400 ముందు ప్రధాని మోదీ సెల్యూట్.. పాక్‌కు బిగ్ వార్నింగ్
దీనివల్ల భారత్‌కు వాయు రక్షణతో పాటు క్షిపణి, నియర్ స్పేస్ ఆధిపత్యాన్ని అందిస్తుందని భారత రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్-400 ఒప్పందంలా కాకుండా.. ఈ ఎస్-500 ను భారత్‌లోనే విడిభాగాలను తయారు చేసేందుకు కో ప్రొడక్షన్ ఒప్పందంగా రష్యా ప్రతిపాదనలు చేస్తోంది. ఎస్-400 పనితీరు చూసిన భారత్.. ప్రస్తుతం కొనుగోలు చేసిన 5 రెజిమెంట్‌లకు అదనంగా మరో 5 ఎస్-400 రెజిమెంట్‌లను కోరుతోంది.
భారత్, రష్యా మధ్య కీలక చర్చలు, ఒప్పందాలు.. రెండు దేశాల సంబంధాల కోసం.. వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్.. ఈనెల 4వ తేదీన భారత్ రానున్నారు. రెండు దేశాల మధ్య ఇంధన సహకారం.. రక్షణ సంబంధాలు, వాణిజ్య విస్తరణ, ఉక్రెయిన్‌తో యుద్ధం, ఇండో-పసిఫిక్ వంటి అంశాలపై ప్రధాని మోదీ, పుతిన్ చర్చించనున్నారు. ఇక రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను వేగంగా డెలివరీ చేయడంపై చర్చలు జరపనున్నారు. ఇక 2021 డిసెంబర్‌లో చివరిసారి పుతిన్ భారత్‌లో పర్యటించారు.
Latest News