|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 11:24 AM
తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. రాణిపేట జిల్లా ఆర్కాడులో మహాలక్ష్మి మహిళా కళాశాల బస్సు సోమవారం 40మంది విద్యార్థినులను ఎక్కించుకుని వాలాజాపేట వైపు వెళ్తుండగా.. డ్రైవర్ రవి(70)కి జంబుకుళం కూడలి వద్ద కళ్లు తిరగడంతో బస్సు అదుపుతప్పి చింతచెట్టును ఢీకొంది. డ్రైవర్ బస్సును పొలంలోకి మళ్లించి ఆపగా, గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు. శోళింగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News