|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:30 AM
సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ పార్టీల నేతల తరహాలో కులాల సమీకరణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాపులు, దళితులు కలిసి పనిచేస్తే రాజ్యాధికారం సాధించవచ్చని ఆయన చేసిన ప్రసంగం సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.అనకాపల్లి జిల్లా గాంధీగ్రామంలో ఆదివారం జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సునీల్ కుమార్ ప్రసంగించారు. ‘‘మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. ఐదేళ్లపాటు ఉండే పదవి కావాలి’’ అని వ్యాఖ్యానించారు. హర్షకుమార్, విజయ్‌కుమార్, జడ శ్రవణ్‌కుమార్ వంటి వారిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. దళితవాడ పంచాయతీ డిమాండ్‌కు కాపు సోదరులు మద్దతిస్తే, తాము వారికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రసంగ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.
Latest News