|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:31 PM
హలీమ్ సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.దీంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి. వీటిలోని గుణాల కారణంగానే ఇంటి చిట్కాల్లో ఎక్కువగా వాడతారు. చాలా మంది న్యూట్రిషనిస్ట్‌లు వీటిని వాడతారు. వీటినే సాధారణంగా అలివ్ విత్తనాలు అనికూడా అంటారు. జుట్టు రాలడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఐరన్ లోపం. దీనిని కంట్రోల్ చేయడానికి అలివ్ విత్తనాల్ని మనం ఇప్పుడు చెప్పినట్లుగా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా పిగ్మెంటేషన్ కూడా దూరమవుతుంది. కాబట్టి, వీటిని చక్కగా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. అదెలానో తెలుసుకోండి.
హలీమ్ గింజలతో లాభాలు
ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, బాడీలో హిమోగ్లోబిన్ లెవల్స్, ఎనర్జీ పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి కారణంగా కణాల నష్టం, ఆక్సీకరణ ఒత్తిడి దూరమవుతుంది.
ఈ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కాస్తా తినగానే కడుపు నిండి జీర్ణ ఆరోగ్యం మెరగవుతుంది.
ఎలా తినాలి
ముందుగా చిటికెడు హలీమ్ గింజల్ని తీసుకుని 6 నుంచి 7 గంటలు నీటిలో నానబెట్టండి. వీటిని ఇప్పుడు పాలు లేదా నెయ్యి, కొబ్బరి ముక్కలతో కలిపి తినండి. చిటికెడు పరిమాణంలోనే సరిపోతాయి. ఎక్కువగా తీసుకోవద్దు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు చెప్పినట్లుగా తింటే బాడీకి సరిగ్గా అబ్జార్బ్ అవుతాయి.
ఎవరు తీసుకోవచ్చు
థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. తీసుకోవచ్చు. 12 సంవత్సరాల పైదాటిన వారు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే పరిమాణం మాత్రం చాలా ముఖ్యం. ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చిటికెడు అంటే చిటికెడు పరిమాణంలోనే తీసుకోవడం మంచిది.
వారానికి ఎన్నిసార్లు
మెరుగైన రిజల్ట్స్ కోసం కనీసం 3 నెలల పాటు వారానికి 4 నుంచి 5 సార్లు తీసుకోవాలి. ఈ గింజల్లో వేడితత్వం ఉంటుంది. కాబట్టి, ఎక్కువగా తీసుకోవద్దు. హెల్దీ ఫ్యాట్స్‌తో తీసుకోవడం మంచిది. తీసుకునే ముందుగా డైటీషియన్‌ని కన్సల్ట్ అయి తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్‌ని బట్టి తీసుకోండి.
హలీం విత్తనాలతో లాభాలు
తీసుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్
బెస్ట్ రిజల్ట్స్ కోసం విత్తనాల్ని నానబెట్టి తీసుకోవాలి.
హెల్దీ, బ్యాలెన్స్‌డ్ డైట్‌తో తీసుకోవాలి.
నెయ్యి, మలైతో కొబ్బరి నీరు, పాల వంటి హెల్దీ ఫ్యాట్స్‌తో తీసుకోవాలి. దీని వల్ల పోషకాలు బాగా గ్రహించడానికి హెల్ప్ అవుతుంది. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే తీసుకోకపోవడమే మంచిది.
Latest News