|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:50 PM
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత జట్టు ప్రభావవంతమైన విజయంతో ఆరంభించింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ప్రోటీస్ జట్టును 17 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది.అయితే విజయం సాధించినప్పటికీ, భారత జట్టులో ముఖ్యంగా బౌలింగ్ విభాగం కొన్ని లోపాలను వెల్లడించింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లేమి స్పష్టంగా కనిపించడంతో, 350 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడటంలో బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ దశలో జాన్సెన్, బాష్ దాడి చూస్తే మ్యాచ్ సఫారీల వైపుకే వెళ్లేలా అనిపించింది. కానీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక బ్రేక్‌త్రూ లు తీసి భారత్‌ను మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు.అలాగే ఈ మ్యాచ్‌లో భారత మిడిల్ ఆర్డర్ కూడా నిరాశపరిచింది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8) ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (13) కూడా చిన్న స్కోరుకు మాత్రమే పరిమితమయ్యాడు.వారిద్దరిపై వేటు… మార్పులు ఖాయం?ఈ నేపథ్యంలో బుధవారం రాయ్‌పూర్‌లో జరగబోయే రెండో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన రుతురాజ్, సుందర్‌లను బెంచ్‌కు పంపే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం.రుతురాజ్ స్థానంలో స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్, సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ జట్టులోకి రానున్నారని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి. గతేడాది చివరిసారిగా వన్డే ఆడిన పంత్, దాదాపు ఏడాదికి తర్వాత మళ్లీ బ్లూ జెర్సీలో అడుగుపెట్టనున్నాడు.గత మ్యాచ్‌లో సుందర్ కేవలం మూడు ఓవర్లకే పరిమితమయ్యాడు. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఉన్న నేపథ్యంలో సుందర్‌ను బెంచ్ చేయాలని కోచ్ గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నితీష్ బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ కూడా వేయగలడనే కారణంగా అతనికి అవకాశం దక్కనుంది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో నితీష్ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేదన్న విషయం గుర్తించాల్సిందే.
Latest News