|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:19 PM
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో, ఆయన నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకున్నారు.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం గ్రామానికి వెళ్లారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లి, ఆమెను పరామర్శించి స్వయంగా పింఛన్ అందజేశారు. అనంతరం నల్లమాడలోని ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.
Latest News